కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్య

Published on May 02,2020 02:00 PM

ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని రామంతాపూర్ లో ఘోరం జరిగింది. తనకు కరోనా సోకిందనే భయంతో వాసిరాజు కృష్ణమూర్తి (60) అనే వ్యక్తి బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి వెళదామని అనుకుంటున్న సమయంలో కరోనా భయంతో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. రామంతాపూర్ లో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. వాసిరాజు కృష్ణమూర్తి అనే వ్యక్తి రామంతాపూర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే కొద్దిరోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాడు.కరోనా లక్షణాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఒక లక్షణం కాబట్టి తనకు కరోనా సోకిందనే భయపడేవాడు. ఆ భయంతోనే కింగ్ కోటి లోని ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడట కూడా. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కరోనా లేదని ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వచ్చాక కూడా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అయితే తనకు కరోనా సోకిందనే భయం తలెత్తడంతో పైనుండి దూకేసాడు దాంతో అక్కడికక్కడే చనిపోయాడు వాసిరాజు కృష్ణమూర్తి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read More

మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు

Published on May 02,2020 01:56 PM

మే 17 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రేపటితో అంటే మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించారు దాంతో మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.  అయితే లాక్ డౌన్ గడువు పొడిగించినప్పటికీ మూడు రకాల జోన్ లను ప్రకటించి రెండు జోన్ లలో కొన్ని వెసులుబాటు కల్పించారు. కరోనా సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్ గా సమస్య లేని ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు.ఇక గ్రీన్ జోన్ లలో సినిమాహాళ్లు , షాపింగ్ మాల్స్ , ఫంక్షన్ హాళ్లు , ఇతర గుమికూడే వాటిపై ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి , మిగతా షాపులు తెరుచుకోవచ్చు. అలాగే ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకే అనుమతి కల్పించారు. ఇక వ్యవసాయ పనులను గ్రీన్ జోన్ తో పాటుగా ఆరెంజ్ జోన్ లో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా చేసుకోవచ్చని కాకపోతే కనీస దూరం పాటించాలని కోరారు. ఇక రెడ్ జోన్ లలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

Read More

ఏపీలో 62 కేసులు : 1525 కు చేరుకున్న కేసులు

Published on May 02,2020 01:53 PM

ఏపీలో కొత్తగా ఈరోజు 62 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి దాంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1525 కు చేరుకుంది. ఏపీలో గత పదిరోజులుగా పెద్ద సంఖ్యలోనే కేసులు నమోదు అవుతున్నాయి. ర్యాపిడ్ టెస్ట్ లు ఎక్కువగా చేస్తుండటంతో పాజిటివ్ కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయని తెలిపారు వైద్యాధికారులు. గడిచిన 24 గంటల్లో 5943 మందిని పరీక్షించగా 62 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని , ఇప్పటివరకు 441 మంది కోలుకోగా 33 మంది మరణించారని పేర్కొన్నారు.ప్రస్తుతం ఏపీలో 1051 యాక్టివ్ కేసులు ఉన్నాయని , గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదని తెలిపారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గణనీయంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. అయితే తెలంగాణలో పరీక్షలు తక్కువ చేస్తుండగా ఏపీలో మాత్రం ర్యాపిడ్ టెస్ట్ లు పెద్ద సంఖ్యలో చేస్తున్నారు. 

Read More

రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ

Published on May 01,2020 04:54 PM

రేపు శనివారం రోజున దేశ పౌరులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు నరేంద్ర మోడీ. ఆమేరకు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. మే 3 న లాక్ డౌన్ ముగియనుంది దాంతో రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 25 న లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మొదట ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు మోడీ. అయితే కరోనా అదుపులోకి రాకపోగా మరింతగా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో లాక్ డౌన్ ని ఏప్రిల్ 14 నుండి మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.ఇక ఎల్లుండితో లాక్ డౌన్ పూర్తి అవుతుండటంతో రేపు మళ్ళీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ మరో రెండు మూడు వారాల పాటు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. కరోనా అదుపులోకి వస్తున్న ఈ తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేయడం వల్ల ప్రమాదం తప్ప ప్రయోజనం లేదని ఈ నిర్ణయానికి వచ్చారట. అయితే మళ్ళీ లాక్ డౌన్ ఇప్పటివరకు ? సడలింపులు ఏంటి ? ఆర్ధిక ప్యాకేజ్ ఏంటి ? అన్నది రేపు తెలియనుంది. 

Read More

జనసేనలో చిరంజీవి చేరడం లేదట !

Published on May 01,2020 04:53 PM

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీలో చేరడం లేదని , అసలు జనసేన అనే కాదు ఏ రాజకీయ పార్టీలో కూడా ఇకముందు చేరడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్ నాగబాబు. గతకొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రానున్నాడు , బీజేపీ లో చేరనున్నాడు  , లేదు లేదు జగన్ పార్టీలో చేరనున్నాడు ..... కాదు కాదు జనసేన పార్టీలో చేరి తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా ఉండనున్నాడు అంటూ రకరకాల కథనాలు వస్తున్నాయి.అయితే కథనాలు అన్నీ తప్పని చిరంజీవి ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని ...... సినిమాల్లో మాత్రమే నటిస్తాడని చెప్పుకొచ్చాడు నాగబాబు. ఆమధ్య నాగబాబు తన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. నా ఇష్టం అనే పేరుతో ఈ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు నాగబాబు. తన అభిప్రాయాలు ఏవైనా సరే దాని నుండే చెప్పడం అలవాటుగా మారింది నాగబాబుకు. అంటే మెగా బ్రదర్ ఇచ్చిన క్లారిటీతో తెలిసింది ఏంటంటే ......  చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అసాధ్యం అన్నమాట. 

Read More