చిరంజీవి - బాలకృష్ణలతో అనిల్ రావిపూడి

Published on May 02,2020 03:35 PM
మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణ లతో సినిమాలు చేయడం నా కల అని అంటున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. బాలకృష్ణ కు సరిపడా కథ నాదగ్గర ఉంది అలాగే చిరంజీవి కోసం ప్రస్తుతం ఓ కథ రాస్తున్నా అది పూర్తయ్యాక చిరంజీవి ని అలాగే బాలకృష్ణ గార్లను కలుస్తానని తప్పకుండా వాళ్లకు ఆ కథలు నచ్చుతాయనే ఆశాభావం వ్యక్తం చేసాడు అనిల్. కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ లో ఉన్నారంతా దాంతో రచయితలూ , దర్శకులు కథలు రాసుకునే పనిలో పడ్డారు.

గతంలోనే బాలయ్య దగ్గరకు వెళ్ళాడు అనిల్ రావిపూడి అయితే అప్పట్లో కుదరలేదు కానీ ఇప్పుడు వరుస విజయాలు సాధిస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఛాన్స్ ఇస్తారేమో ! అలాగే చిరంజీవి కూడా కామెడీ లో దిట్ట దాంతో సరైన టైమింగ్ తో మరింతగా రక్తి కట్టించాలంటే చిరంజీవి బెస్ట్ ఆప్షన్ కాబట్టి తప్పకుండా అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేసినా చేయొచ్చు. అనిల్ రావిపూడి ఎంటర్ టైన్ మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఎఫ్ 2 తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనిల్ రావిపూడి.