వెబ్ సిరీస్ లలో నటించనున్న మెగాస్టార్

Published on May 07,2020 09:54 AM

మెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్ లలో కూడా నటించాలని ఆసక్తి చూపిస్తున్నాడట. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటి యువత ఎక్కువగా అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లలో కాలం గడుపుతున్నారు అందువల్ల అలాంటి ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలంటే కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్ వస్తే అందులో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడట చిరు.

దాంతో ఓ ముగ్గురు నలుగురు దర్శకులతో పాటుగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేయాలనీ చూస్తోందట. ఇక ఈ వెబ్ సిరీస్ ని అగ్ర నిర్మాత చిరు బావమరిది అల్లు అరవింద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అల్లు అరవింద్ '' ఆహా '' అనే ఓటిటీ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసాడు. అది అంతగా క్లిక్ అవ్వలేదు దాంతో దాన్ని అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లకు పోటీగా చేయడానికి ఇలా మాస్టర్ ప్లాన్ వేసాడట.