అనుష్కతో రొమాన్స్ చేయనున్న పవన్ కళ్యాణ్

Published on May 06,2020 10:46 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుసగా మూడు సినిమాలు ప్రకటించడమే కాకుండా అందులో రెండు సెట్స్ మీదకు వెళ్లేలా చేసాడు. వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా క్రిష్ దర్శకత్వంలో '' విరూపాక్ష '' అనే చిత్రం కూడా చేస్తున్నాడు పవన్. బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ గజదొంగగా నటిస్తున్నాడు. కాగా అతడి సరసన సాలిడ్ అందాల భామ అనుష్క నటించనున్నట్లు సమాచారం.

గతంలో అనుష్క క్రిష్ దర్శకత్వంలో '' వేదం '' చిత్రంలో నటించింది. వేదం లో అనుష్క వేశ్య పాత్రలో నటించింది. ఆ పాత్ర అనుష్కకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత మళ్ళీ క్రిష్ తో సినిమా చేయలేదు ఈ భామ. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అనుష్క తో కలిసి సినిమా చేయలేదు దాంతో సాలిడ్ అందాల భామ అనుష్క ని హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావిస్తున్నాడట క్రిష్. పవన్ కళ్యాణ్ అనుష్కతో రొమాన్స్ చేసే ఛాన్స్ ఉండటంతో పవన్ ఫ్యాన్స్ కు ఇది మంచి వార్తే అని చెప్పాలి.