మహేష్ కోసం చైతూకి హ్యాండ్ ఇచ్చాడు

Published on May 02,2020 03:37 PM
దర్శకులు పరశురామ్ అక్కినేని నాగచైతన్యకు హ్యాండ్ ఇచ్చాడు. మహేష్ బాబు తనతో సినిమా చేస్తానని మాట ఇవ్వగానే నాగచైతన్య సినిమా పట్టాలెక్కించాల్సి ఉన్న ఈ సమయంలో చైతూకి హ్యాండ్ ఇస్తూ మహేష్ బాబు సినిమా అయ్యాక మన సినిమా చేద్దామని అన్నాడట. అయితే చైతు బయటకు ఏమి చెప్పకపోయినా లోలోపల మాత్రం పరశురామ్ పై చాలా ఆగ్రహంగా ఉన్నాడట. అంతా సిద్దమని అనుకుంటున్న సమయంలో మన సినిమా లేదు అని అనడం అంటే ఎంత కోపం వస్తుంది ఎవరికైనా.

మహేష్ బాబుని ఒక్కడు సినిమా అప్పటి నుండి డైరెక్ట్ చేయాలనీ కసిగా అనుకుంటున్నాడట పరశురామ్. ఒక్కడు సినిమాని చూసి నేను డైరెక్టర్ అవ్వాలని కోరుకున్నాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరుతోంది అని సంబరపడిపోతున్నాడు పరశురామ్. మహేష్ బాబుతో  పరశురామ్ తీసే సినిమా అదరహో అనిపించేలా ఉంటుందని , ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అంటున్నాడు పరశురామ్. గీత గోవిందం చిత్రం వచ్చిన రెండేళ్లకు మహేష్ బాబు తో సినిమా చేసే ఛాన్స్ లభించింది ఈ దర్శకుడికి. ఇక ఈ సినిమా ఈనెల 31 న కృష్ణ పుట్టినరోజు కాబట్టి కేవలం ప్రారంభం జరుపుకోనుంది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతేనట.