సందీప్ కిషన్ పాత సినిమా డిజిటల్ లో రిలీజ్

Published on May 18,2020 12:16 PM

సందీప్ కిషన్ హీరోగా నటించిన పాత సినిమా '' డీకే బోస్ '' ఇన్నాళ్ల తర్వాత కరోనా పుణ్యమా అని రిలీజ్ కి సిద్ధమైంది. రిలీజ్ అనగానే థియేటర్ లో అనుకోవద్దు ..... డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదల కానుంది డీకే బోస్ చిత్రం. ఈ చిత్రం ఇప్పటిది కాదు సుమా ......  2013 నాటి సినిమా. అంటే ఏడేళ్ల క్రితం సినిమా అన్నమాట. అపుడెపుడో రిలీస్ కావాల్సిన ఈ సినిమని బయ్యర్లు కొనలేదు అలాగే రిలీజ్ కి చాలా ఇబ్బంది పడ్డారు.

దాంతో చాలాకాలంగా మూలకు ఉన్న ఈ సినిమా కరోనా పుణ్యమా అని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. సందీప్ కిషన్ హీరోగా పరిచయమై పదేళ్లు దాటిపోయింది కానీ సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు దాంతో ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాడు పాపం.