24 గంటల్లో 1993 కేసులు

Published on May 01,2020 04:53 PM
గడిచిన 24 గంటల్లో 1993 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి దేశవ్యాప్తంగా దాంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 35,043 కు చేరుకుంది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత అత్యధికంగా ఈరోజు 1993 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో లాక్ డౌన్ పొడిగింపు తప్ప భారత్ కు మరో ప్రత్యామ్నాయమే లేదని భావిస్తున్నారు అధికారులు. అత్యధికంగా మహారాష్ట్ర లో 10,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ స్థానాల్లో గుజరాత్ 4,395, ఢిల్లీ 3,515 , మధ్యప్రదేశ్  2660 , రాజస్థాన్ లో 2584 , తమిళనాడులో 2323, ఉత్తరప్రదేశ్ లో 2,203 కేసులు నమోదు అయ్యాయి.

ఇక ఏపీలో 1463 కేసులు నమోదు కాగా తెలంగాణలో 1031 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అయితే ఈరోజు సాయంత్రానికి తెలంగాణలో మరిన్ని కేసులు నమోదు కానున్నాయి ఎందుకంటే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్యని రాత్రి ఎనిమిది గంటల తర్వాతే అధికారికంగా తెలియజేస్తున్నారు. దేశమంతటా 35,043 కేసులు నమోదు కాగా అందులో 1147 మంది చనిపోగా , 8889 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక యాక్టివ్ కేసులు దేశమంతటా 25,007 గా నమోదు అయ్యింది.