ఏపీలో 62 కేసులు : 1525 కు చేరుకున్న కేసులు

Published on May 02,2020 01:53 PM
ఏపీలో కొత్తగా ఈరోజు 62 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి దాంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1525 కు చేరుకుంది. ఏపీలో గత పదిరోజులుగా పెద్ద సంఖ్యలోనే కేసులు నమోదు అవుతున్నాయి. ర్యాపిడ్ టెస్ట్ లు ఎక్కువగా చేస్తుండటంతో పాజిటివ్ కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయని తెలిపారు వైద్యాధికారులు. గడిచిన 24 గంటల్లో 5943 మందిని పరీక్షించగా 62 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని , ఇప్పటివరకు 441 మంది కోలుకోగా 33 మంది మరణించారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఏపీలో 1051 యాక్టివ్ కేసులు ఉన్నాయని , గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదని తెలిపారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గణనీయంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. అయితే తెలంగాణలో పరీక్షలు తక్కువ చేస్తుండగా ఏపీలో మాత్రం ర్యాపిడ్ టెస్ట్ లు పెద్ద సంఖ్యలో చేస్తున్నారు.