జనసేనలో చిరంజీవి చేరడం లేదట !

Published on May 01,2020 04:53 PM
మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీలో చేరడం లేదని , అసలు జనసేన అనే కాదు ఏ రాజకీయ పార్టీలో కూడా ఇకముందు చేరడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్ నాగబాబు. గతకొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రానున్నాడు , బీజేపీ లో చేరనున్నాడు  , లేదు లేదు జగన్ పార్టీలో చేరనున్నాడు ..... కాదు కాదు జనసేన పార్టీలో చేరి తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా ఉండనున్నాడు అంటూ రకరకాల కథనాలు వస్తున్నాయి.

అయితే కథనాలు అన్నీ తప్పని చిరంజీవి ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని ...... సినిమాల్లో మాత్రమే నటిస్తాడని చెప్పుకొచ్చాడు నాగబాబు. ఆమధ్య నాగబాబు తన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. నా ఇష్టం అనే పేరుతో ఈ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు నాగబాబు. తన అభిప్రాయాలు ఏవైనా సరే దాని నుండే చెప్పడం అలవాటుగా మారింది నాగబాబుకు. అంటే మెగా బ్రదర్ ఇచ్చిన క్లారిటీతో తెలిసింది ఏంటంటే ......  చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అసాధ్యం అన్నమాట.