లాక్ డౌన్ పొడిగింపు తప్పదా ?

Published on May 01,2020 04:52 PM
మే 3 తో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పూర్తి అవుతుంది అయితే తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు ఈ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ నెల అయిపోతున్న సమయంలో సోమవారం రోజున అంటే ఏప్రిల్ 27 న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమావేశంలో మరోసారి ముఖ్యమంత్రుల సలహాలు , సూచనలు తీసుకొని లాక్ డౌన్ ని మే నెలాఖరు వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాలేదు. రోజు రోజుకి ఇంకా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి దాంతో భారతదేశంలో లాక్ డౌన్ పొడిగింపు తప్ప మరో మార్గం లేదని అంటున్నారు విశ్లేషకులు. మే నెలాఖరు వరకు పొడిగింపు తప్ప మరో ఆప్షన్ లేదు కాబట్టి ఒకసారి సీఎం ల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని మే 2 న లేదా మే 3 న మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ని పొడిగించితే తప్పకుండా జూన్ నాటికీ కొంత బెటర్ అవుతామని భావిస్తున్నారు.