మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు

Published on May 02,2020 01:56 PM
మే 17 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రేపటితో అంటే మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించారు దాంతో మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.  అయితే లాక్ డౌన్ గడువు పొడిగించినప్పటికీ మూడు రకాల జోన్ లను ప్రకటించి రెండు జోన్ లలో కొన్ని వెసులుబాటు కల్పించారు. కరోనా సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్ గా సమస్య లేని ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు.

ఇక గ్రీన్ జోన్ లలో సినిమాహాళ్లు , షాపింగ్ మాల్స్ , ఫంక్షన్ హాళ్లు , ఇతర గుమికూడే వాటిపై ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి , మిగతా షాపులు తెరుచుకోవచ్చు. అలాగే ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకే అనుమతి కల్పించారు. ఇక వ్యవసాయ పనులను గ్రీన్ జోన్ తో పాటుగా ఆరెంజ్ జోన్ లో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా చేసుకోవచ్చని కాకపోతే కనీస దూరం పాటించాలని కోరారు. ఇక రెడ్ జోన్ లలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.