రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ

Published on May 01,2020 04:54 PM
రేపు శనివారం రోజున దేశ పౌరులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు నరేంద్ర మోడీ. ఆమేరకు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. మే 3 న లాక్ డౌన్ ముగియనుంది దాంతో రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 25 న లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మొదట ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు మోడీ. అయితే కరోనా అదుపులోకి రాకపోగా మరింతగా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో లాక్ డౌన్ ని ఏప్రిల్ 14 నుండి మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ఎల్లుండితో లాక్ డౌన్ పూర్తి అవుతుండటంతో రేపు మళ్ళీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ మరో రెండు మూడు వారాల పాటు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. కరోనా అదుపులోకి వస్తున్న ఈ తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేయడం వల్ల ప్రమాదం తప్ప ప్రయోజనం లేదని ఈ నిర్ణయానికి వచ్చారట. అయితే మళ్ళీ లాక్ డౌన్ ఇప్పటివరకు ? సడలింపులు ఏంటి ? ఆర్ధిక ప్యాకేజ్ ఏంటి ? అన్నది రేపు తెలియనుంది.