రాజమౌళి రెమ్యునరేషన్ 100 కోట్లా ?

Published on Mar 26,2020 08:19 AM
ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి గాను దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి రేంజ్ అమాంతం పెరిగింది. బాహుబలికి ముందు రాజమౌళి వేరు బాహుబలి తర్వాత రాజమౌళి వేరు అందుకే తన స్థాయికి తగ్గట్లుగా లాభాల్లో వాటా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న.

ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం దాంతో తన రెమ్యునరేషన్ కింద 100 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పటివరకు 11 చిత్రాలకు దర్శకత్వం వహించగా 11 చిత్రాలు కూడా సంచలన విజయాలు సాధించాయి దాంతో రాజమౌళికి ఏ హీరోకు లేని క్రేజ్ వచ్చింది.