కొరటాల శివకు 25 కోట్ల రెమ్యునరేషనా ?

Published on Mar 26,2020 08:25 AM
కొరటాల శివకు 25 కోట్ల రెమ్యునరేషనా ?
దర్శకులు కొరటాల శివ తాజాగా ఆచార్య అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం కొరటాల శివ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా ........ 25 కోట్లట ! అవును వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ ఈ భారీ రెమ్యునరేషన్ నిజమే అని తెలుస్తోంది. కొరటాల శివ ఇంత డిమాండ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ....... చిరంజీవితో సినిమా అనేది ఒక కారణమైతే రెండోది 25 కోట్ల రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.

ప్రభాస్ తో మిర్చి వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కొరటాల శివ. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు అనే మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ అనే సూపర్ హిట్ చిత్రం చేసాడు. కట్ చేస్తే మళ్ళీ మహేష్ బాబుతో భరత్ అనే నేను సూపర్ హిట్ చిత్రం చేసాడు. మొత్తంగా నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహిస్తే నాలుగు కూడా సూపర్ హిట్ అయ్యాయి దాంతో కొరటాల శివ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.