లిప్ లాక్ లపై ఆ భామ ఏమందో తెలుసా ?

Published on Nov 30,2019 12:42 PM

హీరోయిన్ బనిత సంధు ఇచ్చిన లిప్ లాక్ లు తమిళనాట తీవ్ర దుమారం రేపుతున్నాయి దాంతో తీవ్రంగా స్పందించింది ఈ భామ. ఇంతకీ ఈ భామ లిప్ లాక్ గురించి ఏమంటుందో తెలుసా ....... లిప్ లాక్ లు అనేవి ఈరోజుల్లోచాలా కామన్ ...... దీని మీద ఇంత రగడ అవసరమా ? అనేసింది. లిప్ లాక్ లు , శృంగార సన్నివేశాలు అనేవి కథ డిమాండ్ మేరకు చేయాల్సినవి అందులో తప్పేముంది , అయినా నాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు ? అని నిలదీస్తోంది కూడా బనిత సంధు.

ఈ భామ తమిళంలో నటించిన చిత్రం '' ఆదిత్య వర్మ ''. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ఆదిత్య వర్మ గా రీమేక్ చేసారు. ధృవ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో బనిత సంధు హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. శృంగార సన్నివేశాలు , లిప్ లాక్ లు ఎక్కువగా ఉండటంతో విమర్శలు వస్తున్నాయి దాంతో లిప్ లాక్ లు ఇచ్చింది నేను మీకొచ్చిన నష్టం ఏంటి ? అని అంటోంది బనిత సంధు.