తారా చౌదరి ని మోసం చేసాడట

Published on Dec 14,2018 11:37 AM

తనని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రెండేళ్లుగా సహజీవనం చేసిన చావా రాజ్ కుమార్ అనే వ్యక్తి నన్ను మోసం చేసాడని సంచలన ఆరోపణలు చేస్తోంది వివాదాస్పద నటి తారా చౌదరి . ఇంతకుముందు పలు వివాదాల్లో ఉన్న ఈ భామ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది . ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులమీద సినిమాల వాళ్ళ మీద ఆరోపణలు గుప్పించిన భామ ఈ తారా చౌదరి అయితే గతకొంత కాలంగా సైలెంట్ ఉంది . దాంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అంతా . 

కట్ చేస్తే ఇప్పుడు చావా రాజ్ కుమార్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని నా చుట్టూ తిరిగి రెండేళ్ల పాటు సహజీవనం చేసి ఇప్పుడేమో నాకు అప్పులు ఉన్నాయి కాబట్టి నీ ఆస్తిని అమ్మి ఇస్తే ఆ అప్పులను తీర్చేస్తాను అంటూ నన్ను తీవ్రంగా వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది తారా చౌదరి . హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు తారా చౌదరి ఫిర్యాదు ని స్వీకరించి కేసు నమోదు చేసారు . దర్యాప్తు లో ఏ విషయం తేలుతుందో మరి .