అద్వానీకి జైలుశిక్ష పడనుందా ?

Published on Nov 11,2019 16:08 PM

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు , భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ కి బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో శిక్ష పడనుందా ? ఇప్పుడు ఇదే అందరినీ తొలుస్తున్న ప్రశ్న. 27 ఏళ్ల క్రితం బాబ్రీ మసీద్ కూల్చివేసిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీద్ కూల్చివేత సరైంది కాదని , దానికి పాల్పడిన వాళ్లకు కఠిన శిక్ష పడాల్సిందే అని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో అద్వానీ కి జైలు శిక్ష పడనుందా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ పరిశీలకులు.

ఎందుకంటే రామమందిరం నిర్మాణం అంటూ అద్వానీ రథయాత్ర చేసిన విషయం కూడా విదితమే. ఆ రథయాత్ర ముగింపు సందర్భాంగానే బాబ్రీ మసీద్ ని కూల్చారు కరసేవకులు. దానికి అద్వానీ తో పాటుగా పలువురు బీజేపీ నాయకులను నిందితులుగా చేర్చారు. ఈ కేసు దర్యాప్తు సాగుతోంది , ఇక త్వరలోనే బాబ్రీ మసీద్ కూల్చివేత పై కూడా తీర్పు రానున్న నేపథ్యంలో అద్వానీ కి శిక్ష తప్పకపోవచ్చనే వాదన వినిపిస్తోంది.