ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చేది ఏ హీరో

Published on Sep 05,2019 10:17 AM

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకులు అజయ్ భూపతి తన రెండో చిత్రానికి పడరాని కష్టాలు పడుతున్నాడు పాపం. హీరో రవితేజ తో మహాసముద్రం అనే భారీ చిత్రాన్ని చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు అయితే రవితేజ చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో ఏమి చేయాలో పాలుపోని అజయ్ భూపతి చీప్ స్టార్ అంటూ ట్వీట్ చేసి మరింత రచ్చ రచ్చ చేసాడు.
ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా పాపం ఈ దర్శకుడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు , హీరోలు ఛాన్స్ లు ఇవ్వడం లేదు. రవితేజ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు నాగచైతన్య కోసం చూస్తున్నాడు. మరి నాగచైతన్య అయినా ఛాన్స్ ఇస్తాడా ? లేదంటే మళ్ళీ ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నే దిక్కు అవుతాడా ?