ప్లాప్ హీరోయిన్ కి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్న అల్లు అర్జున్

Published on Feb 16,2019 15:06 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ప్లాప్ హీరోయిన్ తో నటించడానికి సిద్ధం అవుతున్నాడు . ఇంతకుముందు దువ్వాడ జగన్నాథం చిత్రంలో తన సరసన నటించింది పూజా హెగ్డే . ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు . కాదు కాదు అసలు పూజా హెగ్డే నటించిన ఏ చిత్రం కూడా కమర్షియల్ హిట్ కాలేదు . చేసిన సినిమాలన్నీ ప్లాప్ లు లేక జస్ట్ యావరేజ్ లు మాత్రమే !

అయినప్పటికీ ఈ భామకు ఎక్కడో సుడి ఉంది అందుకే వరుసగా ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి అది కూడా స్టార్ హీరోల చిత్రాల్లో . తాజాగా ఈ భామ మహేష్ బాబు సరసన మహర్షి చిత్రంలో , ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది . కాగా మళ్ళీ అల్లు అర్జున్ పూజా హెగ్డే కు ఛాన్స్ ఇస్తున్నాడు అలాగే దర్శకులు త్రివిక్రమ్ కూడా . అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే . ఆ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఎంపిక చేశారట .