ఐటెం సాంగ్ లో అనసూయ

Published on Dec 11,2018 15:16 PM

బుల్లితెర పై అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్న భామ అనసూయ జబర్దస్త్ తో కుర్రకారుని ఆకట్టుకుంది . బుల్లితెర పై సెన్సేషన్ సృష్టించిన ఈ భామ వెండితెర మీద కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే . తాజాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , యంగ్ హీరో వరుణ్ తేజ్ లు నటిస్తున్న ఎఫ్ 2 లో అనసూయ నటించనున్నట్లు తెలుస్తోంది . హాట్ భామ అనసూయ చేత ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నాడట దర్శకులు అనిల్ రావిపూడి .

ఇంతకుముందు విన్నర్ అనే సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన సూయ సూయ అనసూయ అంటూ సాగే ఐటెం సాంగ్ లో నటించింది అనసూయ . అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది అనుకోండి . అంతకుముందు నాగార్జున సరసన కూడా ఐటెం సాంగ్ చేసింది అనసూయ . అయితే ఎఫ్ 2 లో మాత్రం చాలా స్పెషల్ అని భావిస్తోంది అనసూయా . ఇక ఈ సినిమా 2019 జనవరిలో విడుదల కానుంది .