యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లి చేసుకోబోతోందా ?

Published on Jan 08,2019 11:01 AM

బుల్లితెర పై యాంకర్ గా సంచలనం సృష్టించిన భామ ఝాన్సీ . పెద్దగా అందగత్తె కూడా కాదు కానీ తన వాక్చాతుర్యంతో ఆహుతులను కట్టిపడేసింది . పలు ఛానల్ లలో అలాగే పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన ఝాన్సీ తెలుగులో చాలా చిత్రాల్లో నటించింది కూడా . అయితే ఛానల్ లో యాంకర్ గా ఉన్నప్పుడే జోగి నాయుడు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ కొన్నాళ్ల తర్వాత కాపురం లో కలహాలు చెలరేగడంతో విడిపోయి విడాకులు తీసుకుంది . అయితే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిలిం నగర్ లో . 

పెళ్లి తో యాంకర్ గా రేసులో వెనుకబడిపోయింది ఝాన్సీ , అయితే అడపా దడపా యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది . అయితే తాజాగా రెండో పెళ్లి పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది . సంపన్నుడైన ఓ  వ్యక్తి ని ఝాన్సీ రెండో పెళ్లి చేసుకోనుందని తెలుస్తోంది . మొదటి వైవాహిక జీవితం ఇబ్బంది పెట్టింది ఝాన్సీ కెరీర్ ని .