అర్జున్ సురవరం విడుదల కాదా ?

Published on Sep 29,2019 09:55 AM

నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం చిత్రం పది నెలలుగా విడుదల వాయిదా పడుతూనే ఉంది. సంక్రాంతి నుండి ఇదిగో విడుదల అదిగో విడుదల అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది తప్ప సినిమా మాత్రం రావడం లేదు. ఇక సాహో విడుదల అయ్యాక తప్పకుండా అర్జున్ సురవరం విడుదల అవుతుందని హీరో నిఖిల్ స్వయంగా వెల్లడించాడు , సాహో విడుదల అయ్యింది పోయింది కానీ నిఖిల్ చిత్రానికి మాత్రం మోక్షం లభించడం లేదు.
తమిళంలో విజయం సాధించిన కనితన్ చిత్రాన్ని తెలుగులో అర్జున్ సురవరం గా రీమేక్ చేసారు కానీ విడుదలలో మాత్రం చాలా సమస్లు ఎదుర్కొంటోంది పాపం ఈ చిత్రం. ఇంత ఆలస్యం అంటే సినిమాపై దాదాపుగా ఆశలు వదులుకున్నట్లే అనుకుంటా.