విలన్ గా నందమూరి బాలకృష్ణ

Published on Apr 17,2020 17:53 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ విలన్ గా నటించనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో బాలయ్య విలన్ గా కనిపించనున్నాడట. బాలయ్య విలన్ గా నటిస్తే అభిమానులు ఊరుకుంటారా ? ఊరుకునే సమస్యే లేదు అందుకే విలన్ క్యారెక్టర్ ని కాస్త డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసాడట దర్శకులు బోయపాటి.

విలన్ లా అనిపించే క్యారెక్టర్ అన్నమాట ! అతడు ఎందుకు అలా చేసున్నాడు అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి వస్తుంది దాంతో ఓహో అందుకేనా ఇలా చేసాడు అనిపించేలా క్యారెక్టర్ ని తీర్చి దిద్దాడట బోయపాటి. ఇంతకుముందు బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో సింహా , లెజెండ్ చిత్రాలు వచ్చాయి దాంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శ్రియా శరన్ , అంజలి హీరోయిన్ లుగా నటిస్తుండగా భూమిక చావ్లా కీలక పాత్రలో విలన్ గా నటిస్తోందట. ఇక కరోనా తగ్గిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.