బాలయ్య - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో

Published on May 02,2020 13:45 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రామారావు గారు అనే సినిమా చేయాలనీ ప్లాన్ చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే అప్పట్లో బాలయ్యకు చెప్పిన కథ అంతగా నచ్చలేదట అందుకే అనిల్ రావిపూడికి హ్యాండ్ ఇచ్చాడట బాలయ్య. కట్ చేస్తే కరోనా వైరస్ తో గ్యాప్ దొరకడంతో అనిల్ రావిపూడి మరోసారి బాలయ్యని కలిశాడట దాంతో బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అయితే బాలయ్య బోయపాటి శ్రీను సినిమా చేయనున్నాడు అది కావాలి అలాగే అనిల్ రావిపూడి ఎఫ్ 3 చేసే పనిలో పడ్డాడు. ఆ చిత్రాలు కంప్లీట్ అయ్యాక అనిల్ రావిపూడి - బాలయ్య కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని తెలుస్తోంది. కరోనా వైరస్ వల్ల 40 రోజుల గ్యాప్ వచ్చింది. ఇక లాక్ డౌన్ మరింతగా పొడిగించే ఆలోచనలో ఉంది కేంద్రం దాంతో ఈ సమయంలో రకరకాల స్క్రిప్ట్ ల గురించి ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. బాలయ్య - అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్ అయితే నందమూరి అభిమానుల సంతోషానికి అంతే ఉండదు.