బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు రాక్షసుడు టైటిల్?

Published on Apr 05,2019 12:27 PM

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రానికి '' రాక్షసుడు '' అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . 1986 లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం రిలీజ్ అయ్యింది . అప్పట్లో రాక్షసుడు చిత్రం ప్రభంజనం సృష్టించింది . కాగా ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆ టైటిల్ ని తన సినిమాకు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నాడట బెల్లంకొండ . 

మధ్యలో రాక్షసుడు అనే టైటిల్ తో డబ్బింగ్ సినిమాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు అయినప్పటికీ కథకు తగ్గట్లుగా ఈ టైటిల్ సరిపోతుందని భావిస్తున్నారట . తమిళంలో విజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు దాంతో రాక్షసుడు అనే టైటిల్ పట్ల సుముఖంగా ఉన్నారు ఆ చిత్ర బృందం .