విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ బ్రేకప్

Published on May 23,2019 15:44 PM

విజయ్ దేవరకొండ తాజా చిత్రానికి బ్రేకప్ అనే టైటిల్ ని పెట్టనున్నట్లు తెలుస్తోంది . తాజాగా ఈ హీరో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కేఎస్ రామారావు సమర్పణలో వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ లు నటిస్తున్నారు . కాగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ లవర్ బాయ్ గా నటిస్తుండగా పలుమార్లు అతడి లవ్ బ్రేకప్ అవుతుందట దాంతో ఈ చిత్రానికి బ్రేకప్ అనే టైటిల్ ని పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది . 

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ జూలై 26 న విడుదల కానుంది , ఇక ఆ సినిమా తర్వాత ఈ బ్రేకప్ సినిమా విడుదల కానుంది . ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై దర్శకుడు క్రాంతిమాధవ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు .