90 ఎం ఎల్ తో హిట్ కొడతాడా ?

Published on Nov 24,2019 21:51 PM

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో హీరోగా పరిచయమై సంచలన విజయం అందుకున్నాడు కార్తికేయ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా 90 ఎం ఎల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కార్తికేయ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 90 ఎం ఎల్ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు కార్తికేయ. శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 5 న విడుదల చేయనున్నారు.

దాంతో ఆ చిత్ర ప్రమోషన్ నిమిత్తం తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు హీరో కార్తికేయ. తాజాగా ఒంగోలు వెళ్లిన ఈ హీరో 90 ఎం ఎల్ తప్పకుండా విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేసాడు. కార్తికేయ ఒంగోలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరగడంతో అతడ్ని చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత కార్తికేయ నటించిన చిత్రాలు అంతగా ఆడలేదు మరి ఈ 90 ఎం ఎల్ ఏమౌతుందో !