రాజశేఖర్ పై యాక్షన్ తీసుకుంటారా ?

Published on Jan 03,2020 18:20 PM

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ పై మా ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) యాక్షన్ తీసుకుంటుందా ? అంటే యాక్షన్ తీసుకోవాల్సిందే అని అంటున్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని కొన్ని వర్గాలు. నిన్న చిరంజీవి , మోహన్ బాబు , కృష్ణంరాజు ల సమక్షంలో మా డైరీ ఆవిష్కరిస్తున్న సమయంలో డాక్టర్ రాజశేఖర్ వ్యవహరించిన తీరుకి అందరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా మునుముందు ఇలాంటి సంఘటనలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారట.

అలాగే చిరంజీవి సైతం ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉన్నారట. వేదిక మీదే రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాల్సిందే అని గట్టిగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్ వేదిక దిగి వెళ్ళిపోయిన తర్వాత మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా చిరంజీవి , మోహన్ బాబు లకు సారీ చెబుతూ వాళ్లతో నాకు ఎలాంటి గొడవలు లేవని ట్వీట్ చేసాడు. రాజశేఖర్ రాజీనామా చేసి క్షమాపణ చెప్పాడు కాబట్టి వదిలేద్దాం అని కొందరు లేదు లేదు చర్యలు తీసుకోవాల్సిందే అని మరొకొందరు వాదిస్తున్నారట. ఇప్పటికైతే తేల్చలేదు కానీ కొద్దిరోజుల తర్వాత ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం ఖాయమని అంటున్నారు.