యాంకర్ ప్రదీప్ హీరోగా సక్సెస్ అవుతాడా ?

Published on Jan 26,2020 12:50 PM

బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ప్రదీప్ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి '' 30 రోజుల్లో ప్రేమించడం ఎలా '' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ప్రదీప్ కు హీరోగా నటించాలని చాలాకాలంగా కోరికగా ఉండేది అయితే ఆ కోరిక తీర్చుకోవడం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఎట్టకేలకు '' 30 రోజుల్లో ప్రేమించడం ఎలా '' అనే చిత్రంలో నటించాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది ఇక త్వరలోనే సినిమా కూడా విడుదల కానుంది.

పలు టీవీ కార్యక్రమాలలో యాంకర్ గా చేసిన ప్రదీప్ బుల్లితెరపై తనదైన ముద్ర వేసాడు. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకోగలడా ? అన్నది పెద్ద సందేహమే ! ఇప్పటికే పలువురు యాంకర్ లు హీరోలుగా , హీరోయిన్ లుగా నటించారు కానీ సక్సెస్ అయినవాళ్లు మాత్రం లేరు అనే చెప్పాలి మరి ఈ ప్రదీప్ ఏమౌతాడో చూడాలి.