అనిల్ రావిపూడి మహేష్ కు హిట్ ఇస్తాడా ?

Published on Nov 23,2019 12:49 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది , డైలాగ్స్ కూడా బాగున్నాయి దాంతో తప్పకుండా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమనే అనుకుంటున్నారు. పైగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పటి వరకు చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే అంటున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అనిల్ కు తిరుగు లేకుండా పోయింది. ఆ వెంటనే సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ చిత్రాన్ని చేసాడు అది కూడా హిట్టే దాని తర్వాత రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ చిత్రం చేసాడు , ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కట్ చేస్తే వెంకటేష్ - వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2 అనే మల్టీస్టారర్ చిత్రం చేసాడు ఇక ఇది బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది దాంతో మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చాడు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో. ఇక ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో విజయాల పరంపర కొనసాగిస్తాడా ? లేక చతికిల బడతాడా ? మహేష్ కు హిట్ ఇస్తాడా ? ఇదే అందరినీ తొలుస్తున్న ప్రశ్న.