అర్జున్ సురవరం హిట్ అవుతుందా ?

Published on Nov 25,2019 11:17 AM

తమిళంలో హిట్ అయిన '' కనితన్ '' చిత్రాన్ని తెలుగులో '' అర్జున్ సురవరం '' గా రీమేక్ చేసారు. నిఖిల్ హీరోగా నటించగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా విడుదలకు సిద్దమై ఏడాది దాటింది కానీ రకరకాల కారణాలతో ఏడాది పాటు విడుదల కాకుండా ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు అన్ని అడ్డంకులు అధిగమించి ఈనెల 29 న విడుదలకు సిద్ధమైంది అర్జున్ సురవరం.

తమిళంలో ఆల్రెడీ హిట్ అయిన సినిమా దాంతో తెలుగులో కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కి కొంత సినిమా చూపించారట కూడా , చూసినంత వరకు సినిమా బాగుండటంతో అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ ని ముఖ్య అథితి గా ఆహ్వానించారు. దాంతో రేపటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు అవుతున్నాడు చిరంజీవి. తమిళంలో లాగే తెలుగులో కూడా అర్జున్ సురవరం హిట్ అవుతుందా ? లేదా ? అన్నది ఈనెల 29 న తేలనుంది.