24 కోట్ల షేర్ బాలయ్య రాబట్టగలడా ?

Published on Dec 19,2019 22:20 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించిన చిత్రం '' రూలర్ ''. రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది ఈ రూలర్ చిత్రం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఓవర్ సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 24 కోట్లకు అమ్ముడుపోయింది. ఓవర్ సీస్ బిజినెస్ అలాగే వసూళ్ళపై పెద్దగా ఎవరికీ ఆశలు లేవు ఎందుకంటే అక్కడ బాలయ్య చిత్రాలకు పెద్దగా గిరాకీ ఉండదు కాబట్టి ఇక మిగిలింది రెండు తెలుగు రాష్ట్రాలు , రెస్ట్ ఆఫ్ ఇండియా మాత్రమే !

నైజాం లో కూడా బాలయ్య చిత్రాలకు పెద్దగా ఓపెనింగ్స్ ఉండవు కాకపోతే ఆంద్రప్రదేశ్ లో ముఖ్యంగా రాయలసీమ లో బాలయ్య సినిమాకు బాగానే గిరాకీ ఉంటుంది దాంతో రూలర్ ఆశలన్నీ ఆంధ్రప్రదేశ్ పైనే ఉన్నాయి. ఈ సినిమాని కొన్న బయ్యర్లకు లాభాలు రావాలంటే 24 కోట్ల షేర్ రావాలి. అయితే రేపు బాలయ్య సినిమాతో పాటుగా మరో మూడు చిత్రాలు కూడా విడుదల అవుతున్నాయి దాంతో బాలయ్య చిత్రానికి విపరీతమైన పోటీ నెలకొంది. ఈ పోటీలో బాలయ్య నెగ్గుతాడా ? 24 కోట్ల షేర్ రాబట్టగలడా ? అన్నది ప్రశ్నగా మారింది.