ఆ డైరెక్టర్ గోల్డెన్ ఛాన్స్ ని ఉపయోగించుకుంటాడా ?

Published on Nov 30,2019 12:38 PM

మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కు మరో హీరో ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో మూడేళ్ళ నుండి ఎక్కిదిగని గడప లేదంటే నమ్మండి. పలువురు హీరోల దగ్గరకు , నిర్మాతల దగ్గరకు వెళ్ళాడు కానీ ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు దాంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ డోలాయమానంలో పడింది. అయితే అనూహ్యంగా తమిళంలో విజయం సాధించిన ''అసురన్ '' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఈ దర్శకుడికి లభించింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , కొత్త బంగారులోకం వంటి హిట్ చిత్రాలకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించినప్పటికీ ఒక్క బ్రహ్మోత్సవం డిజాస్టర్ తో ఈ దర్శకుడ్ని పట్టించుకోవడం మానేశారు. కట్ చేస్తే మూడేళ్ళ తర్వాత శ్రీకాంత్ అడ్డాలకు వెంకటేష్ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ని ఉపయోగించుకుంటాడా ? లేదా ? చూడాలి.