జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టనున్నాడా ?

Published on Nov 22,2019 21:17 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని , అయితే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీలో చేరకుండా కొత్త పార్టీ పెట్టడం ఖాయమని అంటున్నారు రాజకీయ వర్గాలు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమారంగం మీదనే దృష్టి పెట్టనున్నాడు అయితే 2024 ఎన్నికల్లో లేదా 2029 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని అప్పుడు తెలుగుదేశం పార్టీ మరింతగా దిగజారి పోవడం ఖాయమని అందుకే కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమని అంటున్నారు.

2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పెద్ద ఎత్తున ప్రచారం చేసాడు ఎన్టీఆర్ అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది దాంతో ఎన్టీఆర్ ని పక్కన పెట్టారు చంద్రబాబు. అంతేకాకుండా లోకేష్ కు ఎన్టీఆర్ అడ్డంకి కాకూడదు కాబట్టే ఎన్టీఆర్ ని దూరం పెట్టాడని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుతుందా ? లేక జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ అవుతుందా ? అన్నది కాలమే నిర్ణయించాలి.