కీరవాణి కొడుకు హీరోగా సక్సెస్ అవుతాడా ?

Published on Nov 27,2019 15:55 PM

ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి తనయుడు '' సింహా కోడూరి '' హీరోగా పరిచయం అవుతున్నాడు '' మత్తు వదలరా '' అనే చిత్రంతో. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంతో సింహా కోడూరి హీరోగా పరిచయం అవుతుండగా అదే చిత్రంతో కీరవాణి మరో తనయుడు భైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దాంతో కీరవాణి విపరీతమైన టెన్షన్ లో పడ్డాడు. ఒకరు కాదు ఏకంగా ఇద్దరు తనయుల భవిష్యత్ మత్తు వదలరా సినిమాపై పడింది.

షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యింది అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయినప్పటికీ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి కి చూపించి తగిన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారట. ఇక రాజమౌళి కూడా తన అన్నయ్య పిల్లల భవిష్యత్ కాబట్టి సినిమా చూసి కొన్ని సలహాలు ఇచ్చాడట. జక్కన్న సలహాల మేరకు మత్తు వదలరా చిత్రానికి మెరుగులు దిద్దుతున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.