మహేష్ బాబు ఆ సినిమాలో గెస్ట్ గా నటిస్తాడా ?

Published on Feb 21,2020 16:56 PM

మహేష్ బాబు కు టాలీవుడ్ సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది అలాంటి హీరో వేరే హీరోల సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడా ? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతకీ మహేష్ బాబుని గెస్ట్ గా నటించమని కోరుతోంది ఎవరు ? ఏ సినిమాలో తెలుసా ....... ఎఫ్ 2 కి సీక్వెల్ గా రూపొందనున్న ఎఫ్ 3 లో. ఇక మహేష్ ని స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వమని కోరుతోంది దర్శకులు అనిల్ రావిపూడి.

గత ఏడాది ఎఫ్ 2 చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. వెంకటేష్ - తమన్నా , వరుణ్ తేజ్ - మెహరీన్ లు జంటలుగా నటించిన ఎఫ్ 2 చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ చేసే ఆలోచన చేసాడు అనిల్ రావిపూడి. ఇక ఆ సినిమా నచ్చే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చేసే ఛాన్స్ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతి కి విడుదలై సంచలనం సృష్టించింది దాంతో అనిల్ మీద అభిమానం ఏర్పడింది మహేష్ బాబుకు. ఆ చొరవతో ఎఫ్ 3 లో మహేష్ బాబు ని గెస్ట్ గా నటించమని కోరుతున్నాడట అనిల్ రావిపూడి. దాదాపు 20 నిమిషాల నిడివి ఉండే క్యారెక్టర్ కాబట్టి మహేష్ ఆలోచిస్తాడేమో చూడాలి .