100 కోట్ల షేర్ మహేష్ రాబట్టగలడా ?

Published on Jan 08,2020 23:40 PM

జనవరి 11 న మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదల అవుతోంది. మహేష్ బాబు హీరో అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో ఈ సినిమాకు 100 కోట్ల బిజినెస్ జరిగింది. థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోవడంతో ఇక 100 కోట్ల పైచిలుకు షేర్ సాధించడం మహేష్ వంతు అయ్యింది. 100 కోట్లకు పైగా షేర్ వస్తేనే ఈ సినిమాని కొన్న బయ్యర్లు సేఫ్ అవుతారు. బయ్యర్లు సేఫ్ కావాలంటే మహేష్ రికార్డులను బద్దలు కొట్టాలి అప్పుడే బయ్యర్లు ఒడ్డున పడతారు. ఇది పండగ సీజన్ కాబట్టి తప్పకుండా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి ఇక సినిమా బాగుంటే ఆ వసూళ్లు మరింతగా పెరిగి 100 కోట్ల షేర్ రాబట్టడం సాధ్యమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన చిత్రాలన్నీ విజయవంతం కావడంతో సరిలేరు నీకెవ్వరు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే బిజినెస్ కూడా బాగా జరిగింది. ఇక సెన్సార్ టాక్ ప్రకారం కూడా సరిలేరు నీకెవ్వరు హిట్ కావడం ఖాయమని తెలుస్తోంది. అయితే దాదాపు 220 కోట్ల గ్రాస్ వసూళ్లు మహేష్ రాబట్టాలి అప్పుడే భారీ లాభాలు వస్తాయి.