నందమూరి కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడా ?

Published on Nov 12,2019 16:20 PM

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా ''ఎంతమంచివాడవురా '' అనే చిత్రంలో నటిస్తున్నాడు. శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఇక నిజంగానే నందమూరి కళ్యాణ్ రామ్ కు చాలా మంచి వాడనే పేరుంది. అతడికి తగ్గట్లే ఎంతమంచివాడవురా అనే టైటిల్ దొరికింది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ చిత్రాన్ని 2020 జనవరి 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంక్రాంతికి భారీ చిత్రాలు క్యూ కడుతున్నాయి దాంతో థియేటర్ ల సమస్య వస్తుంది అయినప్పటికీ అగ్ర హీరోలతో పోటీ పడుతూ మరీ తన సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా కనుక హిట్ అయితే కళ్యాణ్ రామ్ అదృష్టవంతుడనే చెప్పాలి. అయితే కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడు అయినప్పటికీ భారీ సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నాడు పాపం. మరి ఆ లోటు ఈ సినిమా తీరుస్తుందా ? చూడాలి.