25 కోట్ల షేర్ నితిన్ రాబడుతాడా ?

Published on Feb 25,2020 10:45 AM

ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన '' భీష్మ '' రేపు భారీ ఎత్తున విడుదల అవుతోంది. నితిన్ హీరోగా నటించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు 24 కోట్లు జరిగింది అంటే ఈ సినిమాని కొన్న పంపిణీదారులు లాభాలు పొందాలంటే 25 కోట్ల షేర్ వసూల్ చేయాలి భీష్మ చిత్రం. అయితే నితిన్ నటించిన చిత్రాలు గతకొంత కాలంగా ప్లాప్ లు అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో వస్తున్న భీష్మ 25 కోట్ల షేర్ రాబట్టాలంటే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని సాధించాలి అప్పుడే 25 కోట్ల షేర్ వస్తుంది. 25 కోట్ల షేర్ వస్తేనే బయ్యర్లకు డబ్బులు వస్తాయి. అయితే నితిన్ కు ఇది మంచి సమయమే అని చెప్పాలి ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద నితిన్ చిత్రానికి పోటీ లేదు పైగా సంక్రాంతి చిత్రాల తర్వాత వచ్చిన చిత్రాలేవీ విజయాలను అందుకోలేకపోయాయి. ఆ లోటుని భర్తీ చేయడానికి నితిన్ కు నిజంగా గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.