బిగ్ బాస్ 4 సీజన్ కు మళ్ళీ ఎన్టీఆర్ ?

Published on Dec 05,2019 15:51 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించాడు దాంతో ఆ షో టీఆర్ పి రేటింగ్ లో ఎక్కడికో పోయింది. ప్రారంభంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని రికార్డ్స్ సృష్టించింది బిగ్ బాస్ 1 సీజన్. కట్ చేస్తే బిగ్ బాస్ 4 సీజన్ కు మళ్ళీ ఎన్టీఆర్ ని హోస్ట్ గా తీసుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఎన్టీఆర్ ఇందుకు ఒప్పుకుంటాడా ? లేదా ? చూడాలి.

బిగ్ బాస్ 2 సీజన్ కు హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు అయితే అది హిట్ అయ్యింది కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అందుకే మూడో సీజన్ కు సీనియర్ హీరో నాగార్జున ని తీసుకున్నారు , ఇది కూడా మంచి హిట్ అయ్యింది అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే దాని రేంజ్ మరోలా ఉంటుందని భావిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అసలు వరుసగా ఎన్టీఆర్ తోనే చేయాలనీ అనుకున్నారు కానీ డేట్స్ కుదరక ఎన్టీఆర్ చేయలేదు మరి సీజన్ 4 చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా ?