పవన్ కళ్యాణ్ ఆ సినిమాని చేస్తాడా ?

Published on Nov 28,2019 16:00 PM

బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తాడా ? లేదా ? అన్న అనుమానం తలెత్తుతోంది. దిల్ రాజు తో పాటుగా హారిక హాసిని సినీ క్రియేషన్స్ పతాకంపై ఈ పింక్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసారు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుండి హారిక హాసిని క్రియేషన్స్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ అంటే త్రివిక్రమ్ ...... త్రివిక్రమ్ అంటే పవన్ కళ్యాణ్ సన్నిహితుడు అందుకే ఈ ప్రాజెక్ట్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా ? చూడాలి.

జనసేన కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ బిజీ గా ఉన్నాడు. రాజకీయ పార్టీ పెట్టి ఎపి లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించేది లేదని అన్నాడు పవన్ కానీ పింక్ లో స్వల్ప మార్పులు చేసి రీమేక్ చేయాలనే ఆలోచన చేశారట. కానీ స్క్రిప్ట్ లో మార్పులు దిల్ రాజు తాను అనుకున్నట్లుగా మార్పులు చేస్తున్నాడట దాంతో ఈ డైలమా మొదలయ్యిందట.