పవన్ కళ్యాణ్ ఆ ఛాలెంజ్ ని స్వీకరిస్తాడా ?

Published on Nov 20,2019 13:00 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇంతకీ సీనియర్ నటుడు  కృష్ణ విసిరిన సవాల్ ఏంటో తెలుసా ...... గ్రీన్ ఛాలెంజ్ అదేనండీ మొక్కలు నాటడం. సీనియర్ హీరో కృష్ణ నిన్న మూడు రకాల మొక్కలను తన ఇంటి ఆవరణలో నాటాడు. తాను ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనడమే కాకుండా మరో ముగ్గురికి ఈ సవాల్ ని విసిరాడు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు.

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా రాజకీయాల మీదే తన దృష్టి పెట్టాడు పవన్ కళ్యాణ్. జనసేన తరుపున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఇంకా రాజకీయాల మీద పట్టు సాధించేలా వ్యూహాలు పన్నుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ దశలో కృష్ణ విసిరిన సవాల్ ని స్వీకరిస్తాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో కృష్ణతో పాటుగా  రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ , కాదంబరి కిరణ్  లు పాల్గొన్నారు. నటులు కృష్ణ చాలా రోజులుగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.