రాహుల్ - పునర్నవి పెళ్లి చేసుకుంటారా ?

Published on Nov 06,2019 14:50 PM
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ , నటి పునర్నవి పెళ్లి చేసుకోనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. సింగర్ రాహుల్ - పునర్నవి లు మొదట అంతగా కలిసి లేరు కానీ హౌజ్ లోకి వెళ్లిన తర్వాత మెల్లి మెల్లిగా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కుదిరింది. దాంతో రాహుల్ - పునర్నవి ప్రేమించుకుంటున్నారు అని బిగ్ బాస్ 3 హౌజ్ లో ప్రచారం సాగింది. ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా ఇద్దరు కూడా ప్రవర్తించారు.

కట్ చేస్తే రాహుల్ విన్నర్ కావడంతో రాహుల్ తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సమయంలో రాహుల్ - పునర్నవి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే పెళ్లి చేయడానికి మేము సిద్ధం అని ప్రకటించారు. అయితే అటు పునర్నవి కానీ ఇటు రాహుల్ కానీ ప్రేమలో ఉన్నామని మాత్రం చెప్పడం లేదు అదేంటో ! అంటే ఎప్పుడో అప్పుడు సడెన్ షాక్ ఇస్తూ పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు.