రాంచరణ్ ఆ రీమేక్ లో నటిస్తాడా ?

Published on Feb 11,2020 12:41 PM

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రాంచరణ్ త్వరలోనే నక్సలైట్ గా నటించడానికి కూడా సిద్ధం అవుతున్నాడు. కాగా ఆ రెండు సినిమాల తర్వాత చరణ్ విక్రమ్ వేద అనే తమిళ రీమేక్ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. 2017 లో తమిళనాట విడుదలై విజయవంతం అయిన విక్రమ్ వేద చిత్ర తెలుగు రీమేక్ హక్కులు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నాడు. కాగా ఆ చిత్రాన్ని రవితేజ - రానా లతో చేయాలనీ అనుకున్నాడు కానీ కుదరలేదు దాంతో పక్కన పెట్టాడు.

కట్ చేస్తే ఇప్పుడు ఆ చిత్రాన్ని రాంచరణ్ తో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నాడట అల్లు అరవింద్. మాధవన్ - విజయ్ సేతుపతి విక్రమ్ వేద చిత్రంలో నటించారు. తెలుగులో అయితే మాధవన్ పోషించిన పాత్రని చరణ్ చేత చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట అల్లు అరవింద్. విజయ్ సేతుపతి క్యారెక్టర్ లో ఎవరు సెట్ అవుతారో చూడాలి. అలాగే చరణ్  ఈ సినిమాకు అంగీకరిస్తాడా ? అన్నది కూడా ప్రశ్నే ! ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ అయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో నక్షలైట్ గా ఓ కీలక పాత్ర పోషించ నున్నాడు. దాని తర్వాతే ఏదైనా ......