శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ గా విజయం సాధిస్తాడా ?

Published on Dec 05,2019 16:01 PM

ప్రముఖ హాస్య నటులు శ్రీనివాస రెడ్డి తాజాగా మెగా ఫోన్ చేపట్టాడు.'' భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు '' అనే చిత్రంతో దర్శకుడిగా అవతారం ఎత్తాడు ఈ కమెడియన్. ఒకవైపు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోవైపు దర్శకుడిగా అలాగే హీరోగా కూడా నటించాడు. ఇక ఈ సినిమా వినోద ప్రధానంగా తెరకెక్కింది. ఈనెల 6 న భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు చిత్రం విడుదల కానుంది.

సినిమా అయితే తీసాడు కానీ విడుదల ఎలాగో తెలియదు అందుకే దిల్ రాజు ద్వారా ఈ సినిమాని విడుదల చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని చూసిన వాళ్ళు కూడా తప్పకుండా ప్రేక్షకులను అలరించే సినిమా అనే అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్ లకు వెళ్తారా ? అన్నది ప్రశ్నగా మారింది. పెద్ద హీరోల సినిమాలకు సైతం ప్రేక్షకులు థియేటర్ లకు ఆశించిన స్థాయిలో వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి బాగానే ధైర్యం చేసాడు. ఇక అతడి ధైర్యం కు ప్రేక్షకుల అండ ఉంటుందా ? లేదా ? అన్నది ఈనెల 6 న తేలనుంది.