సుధీర్ హీరోగా సక్సెస్ కొడతాడా ?

Published on Dec 28,2019 16:53 PM

యాంకర్ గా బుల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న సుధీర్ తాజాగా '' సాఫ్ట్ వేర్ సుధీర్ '' చిత్రంతో హీరోగా మారుతున్నాడు. ఈ సినిమా  ఈరోజు విడుదల అయ్యింది. అయితే యాంకర్ గా రాణిస్తున్న వాళ్ళు కొంతమంది హీరోలుగా పరిచయం అయ్యారు అయితే వాళ్లలో ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. సుడిగాలి సుధీర్ గా బుల్లితెర పై సంచలనం సృష్టిస్తూ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు వెండితెర మీద హీరోగా వస్తున్నాడు. యాంకర్ గా హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న సుధీర్ హీరోగా సక్సెస్ కొడతాడా ? ప్రేక్షకులను అలరిస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఎందుకంటే 5 నిమిషాల స్కిట్ వేరు , అరగంట ఎపిసోడ్ ని పండించడం వేరు కానీ ఇక్కడ హీరోగా అంటే రెండు గంటల పాటు ప్రేక్షకులను అలరించడం అంటే మాటలు కాదు మరి. హీరోగా సక్సెస్ అయితే గొప్ప అంటారు అదే తేడా కొడితే మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు వీడికి హీరో వేషాలు అవసరమా ? అని. అయితే సుధీర్ కు వెండితెర మీదకూడా సుడిగాలి ఉందా ? లేదా ? అన్నది రేపటికి తేలిపోనుంది.