తెనాలి రామకృష్ణ తో హిట్ అందుకుంటాడా ?

Published on Nov 12,2019 17:17 PM

సందీప్ కిషన్ కు చాలాకాలంగా సరైన హిట్ లేదు. హీరోగా పరిచయమై పదేళ్లకాలం కావస్తోంది అయినప్పటికీ బ్లాక్ బస్టర్ అన్నది లేకుండాపోయింది. కెరీర్ మొదట్లో కాస్త ఫరవాలేదు కానీ గత నాలుగైదేళ్లుగా హిట్ లేక మొహం వాచిపోయింది సందీప్ కిషన్ ది. ఆమధ్య నిను వీడని నీడను నేనే అనే చిత్రంతో కాస్త ఫరవాలేదనిపించాడు. అయితే ఈసారి తప్పకుండా సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సందీప్ కిషన్.

వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జి. నాగేశ్వర్ రెడ్డి '' తెనాలి రామకృష్ణ '' బి ఏ బి ఎల్ చిత్రానికి దర్శకుడు దాంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా , నవ్వించేలా ఉంది. ఈ తెనాలి రామకృష్ణ ఈనెల 15 న విడుదల కానుంది. మరి ఈ చిత్రంతోనైనా ప్రేక్షకులను నవ్వించి సూపర్ హిట్ కొడతాడా చూడాలి. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేదు దాంతో ఇప్పుడు మంచి చిత్రాలకు చాలా మంచి సమయం.