ఆముగ్గురు కలిసి సినిమా చేస్తారా ?

Published on Apr 25,2020 13:54 PM
మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వస్తుందా ? అన్న ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా రావాలంటే కష్టమే అని తేలిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేనని , నేను ఎక్కువ కాలం తీస్తాను అలాగే పవన్ తక్కువ సమయం షూటింగ్ చేస్తాడు కాబట్టి అని కుండబద్దలు కొట్టాడు జక్కన్న.

అయితే గుడ్డిలో మెల్ల లాగా ఒకవేళ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తానని అయితే అది అప్పటి సమయాన్ని బట్టి అంటూ చెప్పుకొస్తున్నాడు రాజమౌళి. చిరంజీవి - పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో సినిమా అంటే ఆకాశమే హద్దుగా ఉంటుంది. అలాంటి సినిమా వస్తే మెగా అభిమానులు పులకరించిపోవడం ఖాయం. తాజాగా చిరంజీవి ఆచార్య చిత్రం చేస్తుండగా పవన్ మాత్రం వకీల్ సాబ్ , విరూపాక్ష చిత్రాలు చేస్తున్నాడు. ఇక రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.