వెంకటేష్ తో ఇప్పట్లో సినిమా చేయడా

Published on Dec 22,2019 10:25 AM

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో దర్శకులు త్రివిక్రమ్ ఇప్పట్లో సినిమా చేసేలా కనిపించడమే లేదు. అపుడెపుడో మూడేళ్ళ క్రితం వెంకీ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సినిమాని అనౌన్స్ చేసారు. అయితే పేరుకి ప్రకటన అయితే ఇచ్చారు కానీ అది ఇప్పటివరకు కూడా కార్యరూపం మాత్రం దాల్చలేదు. దాంతో ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుందా ? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో అల ..... వైకుంఠపురములో చిత్రం చేస్తున్నాడు దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఉండనుంది. ఆ తర్వాత ఎలాగూ మహేష్ బాబు తో సినిమా చేయాలి అంటే ఈలెక్కన వెంకటేష్ తో సినిమా లేనట్లే !

వెంకటేష్ హీరోగా నటించిన నువ్ నాకు నచ్చావ్ , మల్లీశ్వరి చిత్రాలకు రచన అందించాడు త్రివిక్రమ్. ఆ రెండు సినిమాలు కూడా వెంకటేష్ కెరీర్ లో మైలురాయి గా నిలిచిపోయాయి. అయితే అప్పట్లో త్రివిక్రమ్ కథా రచయిత మాత్రమే ! ఆ తర్వాత దర్శకుడిగా మారాడు సంచలన విజయాలను సొంతం చేసుకుంటూ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ దర్శకుడికి వెంకీ తో సినిమా చేసే ఉద్దేశ్యం ఉందో ? లేదో ? చూడాలి.