విజయ్ దేవరకొండ ఆ పాత్ర చేస్తాడా ?

Published on Dec 05,2019 15:42 PM

టాలీవుడ్ , కోలీవుడ్ , బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషలలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు బయోపిక్ లు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి అయితే అదే సమయంలో ఒకటి రెండు బయోపిక్ లు దారుణమైన ఫలితాలను చవిచూశాయి కూడా . అయినప్పటికీ బయోపిక్ లు మాత్రం ఆగడం లేదు తీస్తూనే ఉన్నారు. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ సెట్స్ పై ఉంది.

జయలలిత పాత్రలో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇక జయలలిత బయోపిక్ అంటే ఎం జి ఆర్ ప్రస్తావన ఎంత ముఖ్యమో అందాల నటుడు శోభన్ బాబు ప్రస్తావన కూడా అంతే ముఖ్యం. ఆ పాత్రలో విజయ్ దేవరకొండ అయితే బాగుంటుందని అతడ్ని సంప్రదించే పనిలో పడ్డారట దర్శక నిర్మాతలు . అయితే శోభన్ బాబు పాత్ర ని పోషించేందుకు విజయ్ దేవరకొండ అంగీకరిస్తాడా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అనే చెప్పాలి ఎందుకంటే విజయ్ దేవరకొండ రేంజ్ ఇప్పుడు స్కై లెవల్లో ఉంది మరి.